Translate

Sunday, November 13, 2011

లేఖ

శ్రీ ఓలేటి వెంకట సుబ్బారావు గారు 2000 లో  విజయవాడ లో SE గా పదవీ విరమణ చేసి, ప్రస్తుతం America లో ఉంటూ తనకి ఇష్టమయిన సాహిత్య పఠనం  సాగిస్తున్నారు. నానారి జ్ఞాపకాలతో ఆయన నాకు రాసిన లేఖ blog లో post చేయడానికి అనుమతి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలతో....

......................................................................
చిరంజీవి రామ్ ప్రసాద్ ని
ఆశీర్వదించి వ్రాయునది
నేను ధవళేశ్వరం లో - 1971 -77  మధ్య కాలం లో   గోదావరి బరాజ్   లో ఇంజినీర్ గా చేసాను. సీతారాముడు  అని పిలవబడే  BVS  రామారావు గారు  నేను  కొలీగ్స్ .సీతారాముడు గారు  బాపు  గారు, రమణ గారు  మద్రాస్  లో స్కూల్ లో చదువుకునే రోజులనుండీ  స్నేహితులు. వీరు, నండూరి రామ మోహన రావు గారు, పులిదిండి రాజు గారు , ఎమ్వీఎల్   అంతా ఒకే బృందం. గోదావరి మీద సినిమా షూటింగ్ పని మీద తరచూ  అక్కడికి వచ్చేవారు. మేమంతా  అక్కడ రకంగా  ధవళేశ్వరం,రాజమండ్రి లలో  సరదాగా  కలుస్తూ వుండే వాళ్ళం.  వీరిలో ఒక్క బాపు గారితో మాత్రం నాకు అంతకు ముందే పరిచయం.తరువాత మా కలయిక లద్వారా అందరమూ  'దగ్గర' అయ్యాము.
ఇక నాన్న గారు - నేను- మా మధ్య 'స్నేహం'- గురించి--కొన్ని  తీపి తలపులు.
ఒకసారి :
ధవళేశ్వరం Inspection Bungalow  లో అందరమూ కలిసాము.అప్పటి మన రాష్ట్ర ముఖ్య మంత్రి    శ్రీ పి. వి.నరసింహారావు గారికి  ఢిల్లీ నుంచి పిలుపు వచ్చి అక్కడ  కాంగ్రెస్ పార్టి  అధ్యక్షులుగా నియమింప బడడం తో -ఇక్కడ రాష్ట్రం లో తరువాత  ముఖ్యమంత్రి ఎవరా అన్న చర్చ వీరి మధ్య మొదలు అయింది. అందరూ కింద తివాచీ మీద వలయాకారం లో   కూర్చుని వేడిగా- వాడిగా చర్చిస్తున్నారు.  వీరిలో ఒకరు - " ఎలా మనం సినిమా వాళ్ళం గనుక మనకు ఉపయోగం ఉండేలా- మన 'రాజు' గారినే ( పులిదిండి రాజు గారు) ముఖ్య మంత్రి చేస్తే సరిపోలే !" అన్నారు. అందుకు రమణ గారు స్పందిస్తూ " రాజు గారు రాజు గారే అవుతారు గానీ మంత్రి ఎలా అవుతారు ?!" అంటూ  చమత్కరించారు.  అందరూ  వెంటనే పకపకలు-!
ధవళేశ్వరం  NGO  క్లబ్  వారు   బాడ్మింటన్  పోటీలను నిర్వహించి- చివరి రోజున   - బహుమతి ప్రదానోత్సవ  సభ జరిపి  విజేతలను  సత్కరించారు.  సభకు  రాజమండ్రి నుండి -శ్రీ నాగేశ్వర రావు గారని - Commercial   Taxes  Officer  ని అధ్యక్షులు  గా  ఆహ్వానించారు. ప్రధాన వక్త శ్రీ ఎమ్ వి ఎల్  మాట్లాడుతూ"  "పనుల  భారం లోనూ-పన్నుల  భారం లో నూ   వున్నా -మా ఆహ్వానాన్ని మన్నించి  వచ్చి - సభకు  అధ్యక్షత  వహించిన  శ్రీ నాగేశ్వర రావు గారికి  మా కృతజ్ఞతలు ..." అనగానే సభికుల నుండి కర తాళ ధ్వనులు.!!
'ముత్యాల ముగ్గు' చిత్రీకరణ రోజులలో- రాజమండ్రి వెళ్ళే దారిలో - నిడమర్తి వారి స్టూడియో  ( పాత బంగ్లా ) ఉండేది. అందులో వీరందరి మకాము. నేను అక్కడ కు వెళ్లి  అందరినీ ( నాన్న గారిని కూడా) కలిసేవాడిని. పరిచయం   - 'స్నేహం' గా మారింది నాన్నగారు సంభాషణలు  వ్రాసిన  ' స్నేహం  ' తో. దాని చిత్రీకరణ   గోదావరి ఒడ్డు - రామ పాదాల రేవు దగ్గర నా అధీనం లో ఉన్న లాంచి, స్టీమర్, పడవలు ( పంట్స్ అంటారు- నావ లు)  వీటి పైన జరిగింది. రకం గా అందులో కొంత  నా ' హస్తం' కూడా  లేక పోలేదు.  మన ముళ్ళపూడి వెంకట రమణ గారు రోజు వాళ్ళ పిల్లలు  వర-అనురాధ లను కూడా అక్కడ కు తెచ్చి వాళ్ళను లాంచి ఎక్కించి నాకు పరిచయం చేసారు.బాపు గారు- నాన్న గారు కూడా వున్నారు.
అపట్లో నాన్న గారు  వ్రాసిన పుస్తకాలు అనేకం ' కానుక- రమణ గారి సాహిత్యం పైన  పరిశోధన '-  ఎమెస్కో  ప్రచురణలు - మెరుపులు - మరకలు, గోరంత దీపం , భక్త కన్నప్ప  సినిమా వెండి తెర  నవలలు,  తెలుగు లో పంచ మహాకావ్యాల పైన  సమీక్ష - (ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య ఎకాడమీ ప్రచురణలు)  నా దగ్గర వున్నాయి.'యువజ్యోతి'  ఆంధ్రజ్యోతి  లో ఆయన కాలం -  లో ఆయన 'మార్కు' హాస్యం- పారడీ లు  కనబడేవి.
తరువాత - నాకు బాగా జ్ఞాపకం- ఆయనా- నేను - నూజివీడు లో కలుసుకోవడం. నేను ఆయనతో ఆయన కాలేజ్ కి వెళ్ళడం ఆయన ఉపన్యాసాన్ని - వెనక బెంచి లో కూర్చుని దొంగ చాటు గా వినడం - తరువాత ఇద్దరమూ  మీ ఇంటికి రావడం. మీ అమ్మ గారు వేడి వేడి గా  అన్నం వండి  చక్కగా గోంగూర పప్పు చేసి   వడ్డించారు. భోజనం లో  మరో  స్పెషల్  మామిడి పళ్ళు నూజివీడు రసాలు. అప్పటికి  పిల్లలు  మీ ఇద్దరు చిన్న వాళ్ళు . - మేము ఇద్దరమూ కలిసి విజయవాడ వెళ్లి ఏలూరు  రోడ్ లో  అనేక బుక్ షాప్స్  కి వెళ్లి  - క్రొత్త గా మేము ధవళేశ్వరం లో మొదలు పెట్టిన  లైబ్రరీ  కోసమని పుస్తకాలను  కొన్నాము.
  అలా పరిచయం - స్నేహం గా  రూపొంది- కాలక్రమేణా బలపడింది. అడపా తడపా  ఉత్తర ప్రత్యుత్తరాలు   మా మధ్య నడిచేవి.. ప్రభవ అనుకుంటాను. ఆయన సంపాదకత్వం లో  మొదలు పెట్టడం - తరువాత  ఒకటి -రెండు ఉత్తరాలు..!!!
రకం గా మీ నాన్న గారు  - నాకు ఆప్త మిత్రులు అయిన  శ్రీ ఎమ్ వి ఎల్  గారి గురించి స్మరించుకునే అవకాశం లభించి నందుకు  ఆనందం గా ఉంది..

ప్రేమతో -ఆశీస్సులతో -
ఓలేటి వెంకట సుబ్బారావు

6 comments:

  1. ఓలేటి వెంకట సుబ్బారావు గారు రాసిన ఎమ్వీయల్ జ్ఞాపకాలు హృద్యంగా అనిపించాయి. దొంగచాటుగా క్లాసు వినటం, రమణ మార్కు మంత్రి- రాజు చమక్కు, ఎమ్వీయల్ మాటల‘పన్’.. ఈ అపురూప విషయాలను గుర్తు చేసుకున్న సుబ్బారావు గారికి అభివందనాలు!

    ReplyDelete
  2. Venu Garu

    Thanks for your visit to Blog and comments.

    ReplyDelete
  3. sri venu gaari souhaardaaniki krutajnatalu. chiranjeevi ramprasad ki dhanyavaadaalu.
    -voleti venkata subbarao /vernon hills -IL/USA.

    ReplyDelete
  4. ఎంవీయల్ గారి వంటి చెయ్యి తిరిగిన రచయితతో తమ స్నేహం తాలూకు జ్ఞాపకాలను అందరితో పంచుకున్న ఓలేటి వారు అభినందనీయులు. ఎంవీయల్ గారిని మరోసారి గుర్తు చేస్తూ ఈ లేఖను మాకందరికీ అందించిన మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. @ SR Rao
    ఆర్యా మీ శిరాక్షతలకు ధన్యోస్మి

    ReplyDelete
  6. బాపూ గారి రాజాధిరాజు కు కూడా ఎమ్వీఎల్ గారు వెండితెర నవల రాశారు. అందులో సినిమాలో లేని ఓ డైలాగుంది.
    నానా గడ్డీ కరచి ఈ పూటకు ఈ పాడు కడుపు నింపుతామా ... సాయంత్రానికి ఖాళీ ... బ్రతుకంతా చిల్లుగంపలో నీళ్లు తోడినట్టే శిశువా అదే నేను అధికారంలోకి వస్తే ... ఆకలిని రద్దు చేసేస్తా ...

    ReplyDelete