Translate

Thursday, October 27, 2011

ఎంకి – కవితాహారతి


కొన్ని మంచి కవితలకి హారతి పట్టిన - ఎమ్వీయల్ రచన 'కవితాహారతి'. అందు లో ఒక భాగం ఈ నండూరి వారి ఎంకి.

మధ్య లో తగిలే జీడిపప్పు పలుకులు - ఎమ్వీయల్ నిర్వహించిన ప్రముఖ ప్రశ్న జవాబుల శీర్షిక 'యువజ్యోతి' నుంచి.
రుచి చూడండి .....



Monday, October 24, 2011

ఎమ్వీయల్ రచనలు


ఎమ్వీయల్ గారి రచనల జాబితా ఇక్కడ పొందుపరిచాను.లభ్యం అవుతున్న రచనల , పాక్షికంగా లభ్యం అవుతున్న రచనల వివరాలు ఇచ్చాను.

ఇదివరకు ప్రచురించిన post ని ఇప్పుడు update చేశాను , కొందరు మిత్రులు  పంపిన పుస్తకాల వివరాలతో కలిపి. 

సూచిక
(*)          - దొరుకుతున్నవి
(కొన్ని* )  - కొన్ని దొరుకుతున్నవి


మిగిలినవి దొరకటం లేదు. ఎవరి దగ్గర అయినా ఉంటే, తెలియచేయమని ప్రార్ధన.

కవితా సంకలనాలు
·         ఉడుగర
·         యులిసిస్
·         కవనకదనం (*)
సినిమా సంభాషణలు 
·         స్నేహం 
·         తూర్పు వెళ్ళే రైలు  
·         ఓ ఇంటి భాగోతం 

నాటకాలు
·         ప్రతిబింబం-మిధ్యాబింబం (*)  

నవలలు
·         మలుపు-మెరుపు (*)  
·         నిన్న స్వప్నం- నేడు  సత్యం (*)  

పరిశోధనలు
·         కవితాహారతి  (*)
·         కానుక   (*)

ఆం. ప్ర. సాహిత్య అకాడెమి వారి తెలుగు పంచ కావ్యాల సంపాదకత్వ పరిచయాలు
·         పారిజాతాపహరణం (*)  
·         ఆముక్తమాల్యద  (*)
·         మనుచరిత్ర  (*)
·         వసు చరిత్ర (*)  
·         పాండురంగ  మహాత్మ్యం

పుస్తకాల లోలోపల
·         తెలుగులొ తిట్టుకవిత్వం
·         తెలుగు నవలా రచయిత్రులు
·         తాళ్ళపాక వారి పలుకుబళ్ళు
·         తెలుగు వ్యుత్పత్తి పదకొశం

ఫీచర్స్
·         ఆణిముత్యాలు ( ప్రాచీన పద్యాల మీద చేసిన వ్యాఖ్యానాలు) 
·         వాణిముత్యాలు (సినిమా పాటల  లో సాహిత్యం గురించీ జ్యోతి చిత్ర’ సినీ వార పత్రిక లో 1974-75 మధ్య ప్రచురితం) 
·         యువజ్యోతి  (కొన్ని*)
·         తాగుడుమూతలు (కొన్ని*)
·         వెండితెర కావ్యాలు (కొన్ని*)
·         అధిక  ప్రసంగం  (కొన్ని* )
·        కొత్త అచ్చు లో పాత కథ  ( విశాలంధ్ర / ప్రతిభ / ప్రగతి పత్రికలలో  - 1968 లో యాభై వారాలు సాగిన శీర్షిక )


రేడియో ప్రసంగాలు
·         నన్నయ్య నాటకీయత
·         హంపీ క్షేత్రం
·         తెలుగు సాహిత్యం లో హాస్యం
·         స్వప్న సందేశం (*)  

వెండి తెర నవలలు

·         ముత్యాల ముగ్గు  (*)
·         అందాల రాముడు
·         గోరంత దీపం (*)
·         భక్త కన్నప్ప
·         మనవూరి పాండవులు
·        రాజాధి రాజు 

కథలు
·        ఓటరు నవ్వని కారణం (*)
·        ప్లెషర్ కుక్కర్ (*)

·        మూడో తరగతి (*)

కవితలు 
·        సమ దృష్టి 

Tuesday, October 18, 2011

బుగ్వేదం

రివ్యూ చేసేవాడికి
బుక్కు రాసేవాడు లోకువ

                             ఎమ్వీయల్

Saturday, October 15, 2011

గంధర్వ గానం


వెదురు పొదల్లో
చెరుకు గడల్లో
ఏనుగు  కుంభస్థలాల్లో
సముద్రం అంతరాళాల్లో
కవిసమయాలు రాలవు

తారల దూరాన్ని
చంద్రుని సారాన్ని
చెప్పడానికి, రహస్యాలు విప్పడానికి
కవి కొలతలు చాలవు
ఖంజన పక్షులు వాలిన చోట
ఖజానాలు దొరకవు

మంచిమనిషి మాటలో, మనసులో
మాధుర్యం వుంది
రతనాల రాసి వుంది
మానవుని మేధలో,తపస్సులో నిధులున్నాయి
నిక్షేపాలున్నాయి
కష్టజీవి కండలలో, గుండెలలో ఖజానాలున్నాయి

గరళాన్ని గళం లో నింపుకుని
కలం లో అమృతం ఒంపకు
అబద్ధాన్ని కవిసమయాల ఒరల్లో దాచి
నిజాన్ని కవిత్వం తో చంపకు


ఎమ్వీయల్
'కవన కదనం' కవితా సంపుటి నుంచి

Wednesday, October 12, 2011

మిత్ర చిత్రాలు - 2

శ్రీయుతులు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం, కెవి మహాదేవన్, ప్రభవ గోపాల రావు గార్ల తో 


Tuesday, October 11, 2011

బాపూరమణీయమ్

బ్లాగ్ లక్ష్యం

                         


ఎమ్వీయల్ గారి జ్ఞాపకాలు నెమరేసుకోడం మెమరేసుకోడం ..
ఒక విశిష్ట వ్యక్తిత్వం కొత్త తరానికి పరిచయం చేయడం ....



అందుకోసం వీలయినవి ఈ బ్లాగు లో పదిల పరచడం

    • ఎమ్వీయల్ ప్రసంగాలు - ( చేసిన వందలాది ప్రసంగాల లో - ఒకటో రెండో మాత్రమే దొరుకుతున్నాయి
    • రచనలు (  వీలైనంత వరకూ , దొరికినంత వరకూ )
    • మిత్రులు ఆయన గురించి చెప్పిన మాటలు ( మిత్ర  వాక్యం)
    • మిత్రులతో ఫోటోలు ( మిత్ర చిత్రాలు )

అయితే, లభ్యం అవుతున్న ఆయన సాహిత్యం చాలా  తక్కువ. ఆయన రచనలూ, ప్రసంగాలూ , మిత్రులకు, శిష్యులకూ  రాసిన ఉత్తరాలూ, అనుభవాలూ, అనుభూతులూ ఎవరయినా పంచుకుంటే చాలా సంతోషం.

ముఖచిత్రం

61 జయంత్యుత్సవ సంచిక ముఖచిత్రం
చిత్రకారులు సర్వ శ్రీ బాపు గారికి కృతజ్ఞతల తో





పరిచయం

ఎమ్వీయల్ సాహితీ సమాఖ్య , నూజివీడు ప్రచురణ - ఎమ్వీయల్ 61 వ జయంత్యుత్సవ సంచిక నుంచీ ........వారికి కృతజ్ఞతల తో


Sunday, October 2, 2011

పండితులూ - పండితారాధ్యులూ

ఎమ్వీయల్ 61వ  జయంత్యుత్సవ సభ లో ( జనవరి  2005)  శ్రీ అత్తిలి వెంకట రమణ గారు ఎమ్వీయల్  గారి పైన రాసిన పద్యాలను, అప్పటికప్పుడు రాగం కట్టి ఆలపిస్తున్న శ్రీ బాలు గారు.
- - o - -
రాసిన 'పండితులు' రమణ గారికి
                                       గాయకులు శ్రీపతి 'పండితారాధ్యుల' వారికి కృతజ్ఞతల తో