Translate

Saturday, October 15, 2011

గంధర్వ గానం


వెదురు పొదల్లో
చెరుకు గడల్లో
ఏనుగు  కుంభస్థలాల్లో
సముద్రం అంతరాళాల్లో
కవిసమయాలు రాలవు

తారల దూరాన్ని
చంద్రుని సారాన్ని
చెప్పడానికి, రహస్యాలు విప్పడానికి
కవి కొలతలు చాలవు
ఖంజన పక్షులు వాలిన చోట
ఖజానాలు దొరకవు

మంచిమనిషి మాటలో, మనసులో
మాధుర్యం వుంది
రతనాల రాసి వుంది
మానవుని మేధలో,తపస్సులో నిధులున్నాయి
నిక్షేపాలున్నాయి
కష్టజీవి కండలలో, గుండెలలో ఖజానాలున్నాయి

గరళాన్ని గళం లో నింపుకుని
కలం లో అమృతం ఒంపకు
అబద్ధాన్ని కవిసమయాల ఒరల్లో దాచి
నిజాన్ని కవిత్వం తో చంపకు


ఎమ్వీయల్
'కవన కదనం' కవితా సంపుటి నుంచి

5 comments:

  1. భలే బాగుందండి !

    ReplyDelete
  2. Rachanala Perlu telistene kadaa, vedikipettagaligedi

    ReplyDelete
  3. తృష్ణ గారూ
    ధన్యవాదములు

    ReplyDelete
  4. Sri గారూ

    మీ సూచన కు ధన్యవాదములు.

    పరిచయం post లో రచనల జాబితా ఉందండీ. ఏవి దొరుకుతున్నాయి ఏవి దొరకలేదు అన్న వివరాలతో ఒక post రాస్తాను.

    ReplyDelete
  5. ‘అబద్ధాన్ని కవి సమయాల ఒరల్లో దాచి
    నిజాన్ని కవిత్వంతో చంపకు’
    ఈ పాదం ఎంతో బాగుంది. కవుల పరిమితులను చెపుతూనే మంచి మనిషికీ, మేధో మానవుడికీ, కష్టజీవికీ పెద్దపీట వేసిన ఈ గంధర్వగానంలో ‘ఖంజన పక్షులు వాలిన చోట
    ఖజానాలు దొరకవు’ అనే ఎమ్వీయల్ వ్యక్తీకరణ ఇప్పటికీ సరికొత్తగా భాసిస్తోంది!

    ReplyDelete