ఎమ్వీయల్ గారి రచనలు దొరికితే పంపమని నేను బ్లాగు లో చేసిన విన్నపం చూసి కొందరు మిత్రులు ఆయన రాసిన ఈ కింది పుస్తకాలు నాకు పంపించారు. నేను కాపీ చేసుకుని ఇస్తానని అడిగినా , నా దగ్గిర ఒరిజినల్ ఉండాలని చాలా అభిమానం తో వారందరూ నాకు ఒరిజినల్ పంపించారు.
వారికి నా వేల వేల కృతజ్ఞతాభివందనాలు !!
ఈ సంబరం అందరితో పంచుకుందామని ఈ పోస్ట్....!!
మహానుభావులు ఎందరో !!
అందులో వీరిది ముందు 'రో' !!!
---------------------------------------------------
1. ఓలేటి వెంకట సుబ్బారావు గారు
1. కవితా హారతి (పరిశోధన)
2. మలుపు – మెరుపు (నవల)
3. కావ్య పరిచయాలు
· ఆముక్తమాల్యద
· వసుచరిత్ర
· పారిజాతాపహరణం
· ప్రతి బింబం, మిధ్యా బింబం (నాటికలు)
· నిన్న స్వప్నం- నేడు సత్యం (నవల)